Haindava: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘హైందవ’ టైటిల్ అనౌన్స్‌మెంట్ టీజర్.. గూజ్‌బంప్స్ పక్కా!
ABN, Publish Date - Jan 08 , 2025 | 04:29 PM
యాక్షన్-హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ BSS12కి టైటిల్ ఖరారు చేస్తూ గ్లింప్స్ వదిలారు. ఈ సినిమాతో లుధీర్ బైరెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తుండగా.. శివన్ రామకృష్ణ సమర్పిస్తున్నారు. ఈ టైటిల్ టీజర్ ఎలా ఉందంటే..
యాక్షన్-హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ అండ్ ప్రతిష్టాత్మక చిత్రం BSS12కి టైటిల్ ఖరారైంది. బుధవారం ఈ చిత్ర టైటిల్ టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు ‘హైందవ’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాతో లుధీర్ బైరెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అడ్వంచర్ అవతార్‌లో కనిపించగా.. ఇప్పుడు వచ్చిన టైటిల్ టీజర్‌లో మరోసారి ఆయన పవర్‌ఫుల్ ప్రెజన్స్‌ని పరిచయం చేశారు. విజువల్ డేంజర్, అడ్వంచర్, డివైన్ ఎనర్జీని ప్రజెంట్ చేస్తూ వచ్చిన ఈ టైటిల్ గ్లింప్స్ గూజ్‌బంప్స్ తెప్పిస్తోంది. ఈ ఒకల్ట్ థ్రిల్లర్ 400 ఏళ్ల నాటి దశావతార ఆలయం నేపధ్యంలో తెరకెక్కుతుండగా, సాయి శ్రీనివాస్ సరసన సంయుక్త ఫీమేల్ లీడ్‌గా నటిస్తున్నారు.
Also Read-Ajith Kumar: రేసింగ్ సర్క్యూట్‌లో అజిత్ కారుకు ఘోర ప్రమాదం.. నుజ్జునుజ్జయిన కారు
Also Read- Renu Desai: అలా ఎలా తీశారో.. ఆ సినిమా చూస్తూ ఏడ్చేశా..
Also Read- Naga Vamsi: తప్పుగా మాట్లాడలేదు.. వివాదంపై క్లారిటీ ఇచ్చిన నాగవంశీ
Also Read-Yearender 2024 ఆర్టికల్స్..
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Jan 08 , 2025 | 04:29 PM