NBK: బాలయ్య 'దబిడి దిబిడి' ఫుల్ సాంగ్ వచ్చేసింది.. వివాదాలకు కేరాఫ్

ABN, Publish Date - Jan 27 , 2025 | 04:15 PM

NBK: తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ మీడియా వరకు రచ్చ చేసిన బాలకృష్ణ సాంగ్ 'దబిడి దిబిడి'. ప్రత్యేకంగా ఈ పాటలో కొరియోగ్రఫీపై తీవ్ర ఆరోపణలు ఎదురయ్యాయి. ఇది ఇలా ఉండగా సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహించగా. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించాయి. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచినా ఈ సినిమా నుండి బాలయ్యతో కలిసి బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేల కలిసి రచ్చ చేసిన సాంగ్ 'దబిడి దిబిడి'. తాజాగా ఈ ఫుల్ వీడియో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. థమన్ మ్యూజిక్ అందించగా.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు.

Updated at - Jan 27 , 2025 | 04:15 PM