Mazaka Movie: ‘మజాకా’ మూవీ ‘బ్యాచ్‌లర్స్ యాంథమ్’

ABN, Publish Date - Jan 29 , 2025 | 11:00 AM

యంగ్ హీరో సందీప్ కిషన్, రావు రమేష్, రీతు వర్మ, అన్షు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘మజాకా’. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం నుండి తాజాగా బ్యాచ్‌లర్స్ యాంథమ్ అంటూ ఓ లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా ‘ధమాకా’ మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది.

పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా‌గా రూపుదిద్దుకుంటోన్న సినిమా ‘మజాకా’. రవితేజ ‘ధమాకా’ మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా, ఉమేష్ కెఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా మరో జంటగా రావు రమేష్, అన్షు కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకోగా.. తాజాగా ఈ మూవీ నుండి ‘బ్యాచ్‌లర్స్ యాంథమ్’ లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Fatima Sana Shaikh: ఓ తెలుగు నిర్మాత పచ్చిగా అడిగాడు.. ‘దంగల్’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్


Also Read- Wife Off Movie Review: బావని చిన్నప్పుడే భర్తగా ఊహించుకున్న మరదలు వేశ్యగా ఎందుకు మారింది?

Also Read- Mega Star Chiranjeevi: ఫస్ట్ షూటింగ్ నాదే..

Also Read- Balakrishna: 'హిట్ 4'లో హీరోగా బాలయ్య?

Also Read- సచిన్ కుమార్తె.. సామాన్యమైనది కాదండోయ్!

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Jan 29 , 2025 | 11:00 AM