Game Changer Song: ‘గేమ్ చేంజర్’.. అరుగు మీద వీడియో సాంగ్

ABN, Publish Date - Feb 05 , 2025 | 08:01 PM

సంక్రాంతికి వచ్చిన ‘గేమ్ చేంజర్’ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు ముస్తాబవుతోంది. విడుదలైన నెల రోజుల లోపే ఈ సినిమా ఓటీటీలోకి వస్తుండటం విశేషం. జనవరి 10న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, ఫిబ్రవరి 7 నుండి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ మూవీ నుండి ఎమోషనల్ సాంగ్ ‘అరుగు మీద’ను మేకర్స్ విడుదల చేశారు.

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో తెలుగు నటి అంజలి ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో చిత్రంలోని ‘అరుగు మీద’ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Samantha: మాజీ భర్త మళ్లీ పెళ్లిపై సమంత షాకింగ్ కామెంట్స్..


Also Read- Tollywood Producer: పవన్ కళ్యాణ్, మహేష్‌లతో చేసిన చిత్రాలతో రూ. 100 కోట్లు నష్టపోయా..

Also Read- Madhavan: కొంపముంచిన ఏఐ.. మాధవన్‌కు అనుష్క కాల్

Also Read- Sairam Shankar: ‘పట్టుకుంటే 10 వేలు’ పథకం పెట్టడానికి కారణం ఏంటంటే..

Also Read- Balakrishna Favourite Heroines: బాలయ్య ఫేవరెట్ హీరోయిన్లు ఎవరో తెలుసా..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Feb 05 , 2025 | 08:01 PM