Anand Deverakonda: బేబీ కాంబో రిపీట్.. బెస్ట్ టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో

ABN, Publish Date - Jan 15 , 2025 | 12:45 PM

Anand Deverakonda: '90స్ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్‌కి సీక్వెల్‌గా సినిమా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ ఆదిత్య హాసన్. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. దీనిని నిర్మిస్తున్న నాగవంశీపైనే కామెడీ చేయడం, మరికొన్ని సన్నివేశాలు హైలెట్‌గా నిలిచాయి. రోషన్ రాయ్.. పెద్దయితే.. ఏమయ్యాడు? ఏమైనా మారాడా లేదా అనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది.

గతేడాది ఈటీవీ విన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజై సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ '90స్ మిడిల్ క్లాస్ బయోపిక్'. మధ్య తరగతి అనుబంధాలను కళ్ళకు కట్టినట్లు చూపించిన ఈ సిరీస్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ దీనికి సీక్వెల్ ప్లాన్ చేశారు. కానీ.. ఇది సిరీస్ కాదు సినిమా. ఇందులో హీరోగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటిస్తున్నారు.

Updated at - Jan 15 , 2025 | 12:49 PM