Ajith: అజిత్ 'పట్టుదల' చూశారా.. కాంట్రవర్షియల్ ఫిల్మ్ ట్రైలర్
ABN, Publish Date - Jan 16 , 2025 | 08:14 PM
Ajith: హీరో అజిత్ కుమార్ లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘విడాముయర్చి’ తెలుగులో 'పట్టుదల' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా హాలీవుడ్ మూవీ 'బ్రేక్ డౌన్'కి కాపీ అని తేలడంతో పెద్ద వివాదమయ్యింది.
కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్‌కుమార్, లైకా ప్రొడక్షన్స్ కలయికలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయర్చి’. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ సినిమా కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ‘విడాముయర్చి’ టీజర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా.. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేశారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను, వైవిధ్యమైన చిత్రాలతో యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ సినిమాలను నిర్మిస్తోన్న ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి.కె.ఎం.తమిళ్ కుమరన్ నేతృత్వంలో సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ఇంకా ఈ చిత్రంలో ఆరవ్, రెజీనా కసండ్ర, నిఖిల్ నాయర్ తదితరులు ఇతర పాత్రల్లో మెప్పించనున్నారు
Updated at - Jan 16 , 2025 | 08:14 PM