Dilruba: ‘దిల్ రూబా’ మూవీ ‘అగ్గిపుల్లే’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Jan 19 , 2025 | 07:49 AM

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘దిల్ రూబా’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అగ్గిపుల్లె..’ విడుదలైంది. ‘క’ బ్లాక్‌బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్‌ని మేకర్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేశారు.

‘క’ సక్సెస్ తర్వాత యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘దిల్ రూబా’. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. శివమ్ సెల్యులాయిడ్స్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోన్న ఈ చిత్ర మ్యూజిక్ ప్రమోషన్స్‌ని మేకర్స్ స్టార్ చేశారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అగ్గిపుల్లె..’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు మేకర్స్.

Also Read-Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌కు సారీ చెప్పిన బాలయ్య ‘డాకు’ బ్యూటీ.. మ్యాటరిదే!

‘అగ్గిపుల్లె..’ లిరికల్ సాంగ్ విషయానికి వస్తే.. ‘అగ్గిపుల్లె అలా గీసినట్టు, కోపంగా చూడకే కొట్టినట్టు, గాలి దుమారమే రేగినట్టు, ఆవేశమెందుకే నొక్కిపెట్టు..’ అంటూ బ్యూటిఫుల్ మెలొడీతో సాగుతుందీ పాట. కిరణ్ అబ్బవరం, సామ్ సీఎస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘క’ మూవీ సాంగ్స్ ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ‘దిల్ రూబా’ ఆడియోపై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.


Also Read-Madhavi Latha: ఈ రోజుల్లో పతివ్రతలు ఎవరు లేరమ్మా.. మాధవీ లత షాకింగ్ కామెంట్స్

Also Read:Manchu Manoj: సింగిల్‌గా వస్తా.. ఎంతమందిని తెచ్చుకుంటావో తెచ్చుకో..

Also Read:Game Changer Review: ‘గేమ్ చేంజర్’ మూవీ రివ్యూ

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Jan 19 , 2025 | 07:49 AM