Thandel Song: ‘తండేల్’ మూవీ ఆజాది లిరికల్ వీడియో సాంగ్
ABN, Publish Date - Feb 06 , 2025 | 09:17 PM
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘తండేల్’. ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలయ్యేందుకు ముస్తాబైన ఈ సినిమా నుండి గురువారం ‘ఆజాది’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్‌ని సినిమాపై క్రియేట్ చేయగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మరో పాటను గురువారం మేకర్స్ విడుదల చేశారు. ‘ఆజాదీ’ అంటూ సాగిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా.. నకుల్ అభ్యంకర్ అలపించారు. ప్రస్తుతం ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతోంది.