Odela 2 Teaser: పంచభూతాలు ఆ రూపానికి దాసోహమే

ABN, Publish Date - Feb 22 , 2025 | 11:37 AM

తమన్నా (Tamannaah) ప్రధాన పాత్రలో అశోక్‌తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓదెల 2’ (Odela 2). హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్‌.సింహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌తో కలిసి మధు క్రియేషన్స్‌ పతాకంపై డి.మధు నిర్మిస్తున్నారు. తాజాగా ఈసినిమా టీజర్‌ను  మహాకుంభమేళాలో విడుదల చేశారు. శివశక్తిగా తమన్నా నటన ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా సాగింది. ఉత్కంఠ రేకేత్తించే సన్నివేశాలతో టీజర్‌ ఆద్యంతం అలరించేలా ఉంది. 2022లో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్‌’ చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రం రూపొందుతోంది. 

Updated at - Feb 22 , 2025 | 12:47 PM