Apanna Tanna Manna: సుకుమార్ విడుదల చేసిన దూరదర్శని లిరికల్‌ వీడియో

ABN, Publish Date - Apr 18 , 2025 | 04:58 PM

1990 నాటి ప్రేమకథతో తెరకెక్కిన సినిమా 'దూరదర్శిని'. ఈ సినిమాలోని 'అపనా తనా మనా' అనే లిరికల్ వీడియోను దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు.

సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్ జంటగా నటిస్తున్న చిత్రం ’దూరదర్శని’ (Dooradarshini). కలిపింది ఇద్దరిని అనేది ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకుడు. బి. సాయి ప్రతాప్ రెడ్డి, జయ శంకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. 1990 నేపథ్యంలో అందరి హృదయాలను హత్తుకునే ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టైటిల్ టీజర్‌కు, 'నా నీడ వెళుతుందా' అనే లిరికల్‌ వీడియో కు మంచి స్పందన వచ్చిందని మేకర్స్ తెలిపారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'అపనా తనా మనా' అనే లిరికల్ వీడియోను పాన్‌ ఇండియా డైరెక్టర్ సుకుమార్‌ (Sukumar) తో విడుదల చేయించారు. సింధుజ, శ్రీనివాసన్‌ ఆలపించిన ఈ సాంగ్‌కు సురేష్‌ బనిశెట్టి సాహిత్యం అందించారు. ఆనంద్‌ గుర్రాన బాణీలు సమకూర్చారు.


ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్‌ మాట్లాడుతూ ''ఈ సినిమా హీరో సువిక్షిత్‌ నా రూపం వచ్చేటట్లు వరిపొలంలో ఫామింగ్‌ చేశాడు. నాకు అప్పట్నుంచి పరిచయం ఉంది. తనకి సినిమా అంటే పాషన్‌. సాంగ్‌ చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి. ఈ మూవీ అందరికి మంచి విజయం అందించాలి'' అన్నారు. హీరో సువిక్షిత్ మాట్లాడుతూ “నా అభిమాన దర్శకుడు, నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి సుకుమార్‌ చేతుల మీదుగా మా సాంగ్‌ ఆవిష్కరణ జరగడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ సినిమా అందరిని నాలుగు దశాబ్దాల వెనక్కి తీసుకెళుతుంది. అప్పటి రోజుల్ని గుర్తుకు తెస్తుంది. అందరికి వాళ్ల వాళ్ల ప్రేమకథలు కూడా గుర్తుకు వస్తాయి”అని తెలిపారు.

Also Read: Kalyan Ram: అర్జున్ సన్నాఫ్ వైజయంతి రివ్యూ

Also Read: Madhuram movie : మధురం సినిమా రివ్యూ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 18 , 2025 | 05:08 PM