Siddu: జాక్... కొంచెం క్రాక్ మాత్రమే కాదు తేడా కూడా...
ABN, Publish Date - Apr 03 , 2025 | 12:32 PM
సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీ 'జాక్' ఏప్రిల్ 10న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.
ఇప్పటి వరకూ ఎలాంటి భారీ అంచనాలు లేని 'జాక్' (Jack) మూవీకి లేటెస్ట్ గా విడుదలై ట్రైలర్ తో అంచనాలు పెరిగాయి. రొటీన్ టెర్రరిస్ట్ ఛేజింగ్ డ్రామాగా ఇది పైకి కనిపించినా... సమ్ థింగ్ స్పెషల్ గా మూవీ ఉండబోతోందని, ఫుల్ యాక్షన్ తో పాటు యూత్ కోరుకునే ఎంటర్ టైన్ మెంట్ కు ఇందులో ప్రాధాన్యం ఉందని ఈ ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) పోషించిన జాక్ పాత్ర గురించి కొంత క్లారిటీని ఈ ట్రైలర్ ఇచ్చినా... హీరోయిన్ వైష్ణవీ చైతన్య (Vaishnavi Chaitanya) పాత్రను పూర్తి స్థాయిలో రివీల్ చేయలేదు. ఇక 'డీజే టిల్లు, టిల్లు స్క్వేర్' మూవీస్ తో యూత్ ను మాగ్జిమమ్ ఎంటర్ టైన్ చేసిన సిద్ధు జొన్నలగడ్డ అదే ట్రాక్ లో సాగబోతున్నాడని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకుడు. ప్రకాశ్ రాజ్, నరేశ్, బ్రహ్మాజీ, రవిప్రకాశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ ట్రైలర్ చూసేయండి...
Also Read: NTR: తారక్ అతిథిగా మ్యాడ్ స్వ్కేర్ సక్సెస్ సెలబ్రేషన్స్
Also Read: Aamir Khan: లాపతా లేడీస్ మూవీపై నెటిజన్స్ సెటైర్స్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి