Raid -2: అవినీతి నేత వర్సెస్ ఐ.ఆర్.ఎస్. అధికారి....
ABN, Publish Date - Apr 08 , 2025 | 02:54 PM
అజయ్ దేవ్ గన్ ఐ.ఆర్.ఎస్. అధికారిగా నటించిన 'రైడ్ -2' మూవీ ట్రైలర్ విడుదలైంది. అవినీతి నేత ఆటను ఈ ప్రభుత్వ అధికారి ఎలా కట్టించాడన్నదే ఈ చిత్ర కథ.
బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవ్ గన్ (Ajay Devgn) నటించిన 'రైడ్' (Raid) మూవీ 2018లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఆధారంగానే ఆ మధ్య రవితేజ (Raviteja) హీరోగా 'మిస్టర్ బచ్చన్' మూవీ తెరకెక్కింది. అయితే తెలుగు రీమేక్ పరాజయం పాలైంది. ఐ.ఆర్.ఎస్. అధికారి అమయ్ పట్నాయక్ గా అజయ్ దేవ్ గన్ నటించిన 'రైడ్'కు సీక్వెల్ గా 'రైడ్ 2' (Raid -2) మూవీ రూపుదిద్దుకుంది. ఈ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో అమయ్ పట్నాయక్... అవినీతి రాజకీయ నేత దాదా భాయ్ ని ఢీ కొట్టబోతున్నాడు. కరుడుగట్టిన నేరస్థులను తలపించే కరెప్ట్ పొలిటీషన్ దాదా భాయ్ గా రితేశ్ దేశ్ ముఖ్ (Riteish Deshmukh) నటించాడు. వాణి కపూర్ (Vaani Kapoor) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రజత్ కపూర్, సౌరభ్ శుక్లా, సుప్రియా పాఠక్, అమిత్ సైల్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ మూవీలోని ఐటమ్ సాంగ్ ను తమన్నా భాటియా (Tamanna Bhatia) పై చిత్రీకరించారు. 'రైడ్ -2' ట్రైలర్ ను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు.
నిజాయితీ మారు పేరైన ఇండియన్ రెవిన్యూ సర్వీస్ ఆఫీసర్ అమయ్ పట్నాయక్ చేపట్టిన 75వ రైడ్ ఏ విధంగా సక్సెస్ అయ్యిందనేదే 'రైడ్ -2' సినిమా. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, కుమర్ మంగత్ పట్నాయక్, అభిషేక్ పట్నాయక్ సంయుక్తంగా నిర్మించారు.
Also Read: AA22 X A6: ఆకాశమే హద్దుగా బన్నీ - అట్లీ మూవీ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి