Peddi First Shot: రామ్ చరణ్ చెప్పినట్టే ఫస్ట్ షాట్ అదిరింది
ABN, Publish Date - Apr 06 , 2025 | 12:17 PM
రామ్‌చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పెద్ది’ (Peddi). జాన్వీకపూర్ (Janhvi Kapoor) కథానాయిక. గ్రామీణ నేపథ్యంలో క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోన్న చిత్రమిది. శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్ర బృందం ‘పెద్ది గ్లింప్స్’ (Peddi Glimpse) విడుదల చేసింది. ఇందులో రామ్‌చరణ్ పాత్ర ఏవిధంగా ఉండనుందో చూపించారు. ‘ఏదైనా ఈ నేలమీద ఉన్నప్పుడే సేసేయాల.. పుడతామా ఏటి మళ్లీ..!’ అంటూ ఆయన ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగ్‌లు ఈలలు వేయించేలా ఉన్నాయి. ముఖ్యంగా గ్లింప్స్ చివర్లో చరణ్ కొట్టిన సిక్స్ షాట్ అదిరిపోయేలా ఉంది. వచ్చే ఏడాది మార్చి 27న ఇది విడుదల కానుంది.
Updated at - Apr 06 , 2025 | 12:52 PM