Robinhood: డేవిడ్ వార్నర్ కు టీచర్స్ అయ్యారు..
ABN, Publish Date - Mar 25 , 2025 | 04:34 PM
నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కిన చిత్రం ‘రాబిన్‌హుడ్’ (RobinHood). వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో కనిపిస్తారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. దీనికి సంబంధించి డేవిడ్ వార్నర్ కు తెలుగు నేర్పించే పనిలో నితిన్, శ్రీలీల బిజీగా ఉన్నారు. ప్రీరిలీజ్ వేడుకకు ముందు డేవిడ్ వార్నర్‌కు తెలుగు నేర్పిస్తున్న ఓ ఫన్నీ వీడియోను చిత్ర బృందం పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది
Updated at - Mar 25 , 2025 | 04:39 PM