Test Movie: కుముదగా నయనతార
ABN, Publish Date - Mar 14 , 2025 | 02:52 PM
లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న చిత్రం ‘టెస్ట్’ (Test). స్పోర్ట్స్ డ్రామాగా రూపొండుతోంది. ఎస్.శశికాంత్ దర్శకుడు. నెట్‌ఫ్లిక్స్ ఓ టీ టీ (Netflix) వేదికగా ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో నయనతార పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో కుముధ పాత్రలో నయనతార కనిపించనున్నారు. కుముధ కల ఏంటో వివరిస్తూ రిలీజైన టీజర్ ఆకట్టుకుంటోంది. ఆర్. మాధవన్ కీలకపాత్రలో కనిపించనున్న ఈ సినిమాతెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.