Thandel: ‘తండేల్’ నుంచి శివ శక్తి పాట వచ్చేసింది
ABN, Publish Date - Jan 04 , 2025 | 08:48 PM
నాగచైతన్య (Naga Chaitanya) కథానాయకుడిగా గీతా ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న చిత్రం ‘తండేల్’ (Thandel). సాయిపల్లవి (Sai Pallavi) కథానాయిక. చందూ మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నాను. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి విడుదలైన ‘బుజ్జి తల్లి’ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. సినిమాలో హైలైట్‌గా నిలిచే శివ శక్తి పాటను (Shiva Shakthi Song Release) తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. శ్రీకాకుళం సాంస్కృతిక వారసత్వాన్ని, పురాతన శ్రీ ముఖలింగం శివాలయాన్ని ప్రతిబింబించే పాటగా దీనిని తీర్చిదిద్దారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. నమో నమః శివాయ అంటూ సాగే ఈపాటను అనురాగ్ కులకర్ణి, హరిప్రియ దీనిని ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు.
Updated at - Jan 04 , 2025 | 08:48 PM