Kiss Kiss Kissik: ఆ హీరో ముద్దు పెడితే అంతే..
ABN, Publish Date - Mar 08 , 2025 | 03:54 PM
సుశాంత్, జాన్యా జోషి, విధి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పింటూ కీ పప్పి’. శివ హరే దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై విధి ఆచార్య నిర్మించారు. మార్చి 21న ఈ సినిమా విడుదల కానుంది. తెలుగు, తమిళం, మలయాళంలో ‘కిస్ కిస్ కిస్సిక్’ పేరుతో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ‘కిస్ కిస్ కిస్సిక్’ ట్రైలర్‌ను విడుదల చేసింది. సుశాంత్, జాన్యా జోషి యాక్టింగ్ ఆకట్టుకునేలా ఉంది. కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య కీలక పాత్రలో నటించారు. హీరో ముద్దు పెట్టిన అమ్మాయిలందరికీ వేరే అబ్బాయిలతో పెళ్లి కావడం, ఆ తర్వాత అతడు ఏం చేశాడు? తాను ఎంతగానో ఇష్టపడిన అమ్మాయిని అతడు ముద్దు పెట్టుకున్నాడా? వంటి అంశాలతో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది.
Updated at - Mar 08 , 2025 | 03:54 PM