Beauty: 'కన్నమ్మ కన్నమ్మ' లిరికల్ సాంగ్

ABN, Publish Date - Apr 07 , 2025 | 03:34 PM

వానరా సెల్యూలాయిడ్, మారుతీ టీం ప్రొడక్ట్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘బ్యూటీ’. గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్, భలే ఉన్నాడే ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వం వహించిన ‘బ్యూటీ’ చిత్రాన్ని అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మించారు. అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ‘బ్యూటీ’ చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, పాటలు అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ బ్యూటీఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. 'కన్నమ్మ కన్నమ్మ' అంటూ సాగే ఈ పాటను సనారే రాయగా.. ఆదిత్య ఆర్కే, లక్ష్మీ మేఘన ఆలపించారు.  విజయ్ బుల్గానిన్  సంగీతం అందించారు. పాట సాహిత్యం గానీ, పిక్చరైజేషన్ గానీ, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ గానీ ఎంతో అద్భుతంగా ఉంది. 

Updated at - Apr 07 , 2025 | 03:34 PM