Sunny Deol : జాట్ థీమ్ సాంగ్ వచ్చేసింది...

ABN, Publish Date - Apr 08 , 2025 | 01:23 PM

సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన సినిమా 'జాట్'. ఏప్రిల్ 10న మూవీ విడుదల కాబోతున్న నేపథ్యంలో తాజాగా థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol) నటిస్తున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ 'జాట్' (Jaat). ఏప్రిల్ 10న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. గోపీచంద్ మలినేని (Gopichand Malineni) డైరెక్షన్ లో పీపుల్స్ మీడియా, మైత్రీ మూవీమేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యస్ చేశాయి. తాజాగా ఈ సినిమా థీమ్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఎస్. థమన్ (S Thaman) స్వరాలు సమకూర్చిన ఈ పాటను అమృత్ మాన్ రాసి, పాడారు. పంజాబీ యాసలో సాగే ఈ పాట జాట్ల గొప్పతనాన్ని తెలిపేలా సాగింది. రణదీప్ హుడా (Randeep Hooda) విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్ర ఇతర కీలక పాత్రలు పోషించారు. పీటర్ హెయిన్, అన్ల్ అరసు, రామ్ లక్ష్మణ్, వెంకట్‌ యాక్షన్ కొరియోగ్రాఫర్‌ గా వ్యవహరించారు.

Updated Date - Apr 08 , 2025 | 01:29 PM