Ajith Kumar: గుడ్ బ్యాడ్ అగ్లీ వస్తోందట...

ABN, Publish Date - Apr 07 , 2025 | 01:04 PM

అజిత్ హీరోగా నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ తెలుగు వర్షన్ విడుదల అవుతుందో లేదా అనే సందేహానికి ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అజిత్ కుమార్, త్రిష, సిమ్రాన్ కీలక పాత్రలు పోషించిన సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే తెలుగులో విడుదల అవుతుందో లేదో అనే సందేహానికి మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేసి చెక్ పెట్టేశారు. ఏప్రిల్ 10న తెలుగులోనూ ఈ సినిమా జనం ముందుకు వస్తుందని ట్రైలర్ చివరిలో తెలిపారు. తమిళ మూవీ ట్రైలర్ విడుదలై మూడు రోజులు కాగా... కాస్తంత ఆలస్యంగా సోమవారం తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు. అయితే... అజిత్ కు వీరాభిమానులు ఉన్న తమిళనాడు మీదే నిర్మాతలు ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అర్థమౌతోంది. సో... తెలుగు, తమిళ భాషల్లో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఏప్రిల్ 10న వస్తుందనే అనుకోవాలి. అద్విక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్ సంగీతం అందించాడు. ప్రభు, ప్రసన్న, అర్జున్ దాస్, సునీల్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.

Updated Date - Apr 07 , 2025 | 01:04 PM