Sankranthiki Vasthunam: ‘గోదారిగట్టు మీద రామచిలకవే’.. ఫుల్ వీడియో
ABN, Publish Date - Feb 09 , 2025 | 12:49 PM
వెంకటేశ్ (Venkatesh) హీరోగా నటించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. (Sankranthiki Vasthunam). ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించారు. సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. భారీ వసూళ్లు రాబట్టింది. ఇందులో వెంకటేశ్, ఐశ్వర్యపై చిత్రీకరించిన ‘గోదారి గట్టు మీద రామచిలకవే’ అంటూ సాగే పాట సూపర్‌హిట్ అయిన విషయం తెలిసిందే. భీమ్స్ సంగీతంలో రమణ గోగుల, మధుప్రియ ఈ పాటను ఆలపించారు. తాజాగా ఈ పాట ఫుల్ వీడియో (Godari Gattu Video Song) చిత్ర బృందం విడుదల చేసింది.
Updated at - Feb 09 , 2025 | 12:50 PM