AA22 X A6: ఆకాశమే హద్దుగా బన్నీ - అట్లీ మూవీ

ABN, Publish Date - Apr 08 , 2025 | 11:49 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోతో తెరకెక్కబోతున్న ప్రాజెక్ట్ అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతోందని సన్ పిక్చర్స్ విడుదల చేసిన వీడియో చూస్తుంటే అర్థమౌతోంది.

ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) బర్త్ డే సందర్భంగా కొత్త సినిమా ప్రకటన అధికారికంగా వెలువడింది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) తో బన్నీ నెక్ట్స్ మూవీ ఉంటుందని రూఢీ అయ్యింది. ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ రేంజ్ లో సన్ పిక్చర్స్ (Sun Puctures) సంస్థ కళానిధి మారన్ సమర్పణలో నిర్మించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన చర్చల నిమిత్తం బన్నీ చెన్నయ్ వెళ్ళినప్పుడే వీరి కాంబోలో మూవీ ఉంటుందని వార్తలు బయటకు వచ్చాయి. అప్పటి నుండి ఈ సినిమా రేంజ్ ఏమిటనే చర్చ మీడియాలో జరుగుతోంది.

అల్లు అర్జున్ మిత్రులు ఈ సినిమా ఎవరూ ఊహించని స్థాయిలో ఉంటుందని చెబుతున్నా... ఇవాళ ఈ సినిమా ప్రకటన సందర్భంగా విడుదల వీడియోను చూసిన తర్వాత అందరి అంచనాలను తల్లకిందులు చేస్తే... ఇదో హాలీవుడ్ రేంజ్ మూవీ అనే విషయం అర్థమైంది. సూపర్ డూపర్ హాలీవుడ్ మూవీస్ కు వీఎఫ్ ఎక్స్ ప్లస్ స్పెషల్ ఎఫెక్ట్స్ సమకూర్చిన ప్రముఖ సంస్థలు బన్నీ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్ళబోతున్నాయి.


విశేషం ఏమంటే... బలమైన కథ ఉన్నప్పుడే ఈ రకమైన స్పెషల్ ఎఫెక్ట్స్ మరింతగా ఎలివేట్ అవుతాయి. హాలీవుడ్ టెక్నీషియన్స్ అందరూ ఈ కథలోని కోర్ పాయింట్ తమను సంభ్రమకు గురిచేసిందని చెబుతున్నారు. సో... 'పుష్ప-2'లో చెప్పినట్టు అల్లు అర్జున్ ఇప్పుడు నేషనల్ కాదు... ఇంటర్నేషనల్!! ఆ విషయాన్ని ఈ వీడియోతో మేకర్స్ చెప్పకనే చెప్పారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది... ఎప్పుడు విడుదల అవుతుందనేది తెలియాల్సి ఉంది. తమిళ చిత్రాలతో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అట్లీ చివరగా షారుఖ్ ఖాన్ తో 'జవాన్' మూవీని తీసి వేయి కోట్ల క్లబ్ లో చేరిపోయాడు... అల్లు అర్జున్ 'పుష్ప -2' ఆల్ రెడీ దాదాపు రెండు వేల కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇప్పుడీ ఇద్దరి కాంబోలో రాబోతున్న సినిమా రేంజ్ కలెక్షన్స్ పరంగా ఏ స్థాయిలో ఉంటుందనేది ఎవరి ఊహకూ అందడం లేదు. ఒక్క మాట మాత్రం అనుకోవచ్చు... దీనికి స్కై ఈజ్ ద లిమిట్... అంతే...

Updated Date - Apr 08 , 2025 | 11:52 AM