Sankranthiki Vasthunam: అయ్యబాబోయ్.. ఇవేం ప్రమోషన్స్.. పీక్స్ అంతే!
ABN, Publish Date - Jan 01 , 2025 | 07:37 PM
సంక్రాంతి బరిలో ఉన్న మూడు చిత్రాలలో విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రమోషన్స్.. జనాల్లోకి బాగా వెళుతున్నాయి. అనిల్ రావిపూడి తనదైన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఈ ప్రమోషన్స్‌లో మిక్స్ చేయడంతో అంతా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. తాజాగా టీమ్ ఓ హిలేరియస్ ఎంటర్‌టైనింగ్ వీడియోని వదిలింది.
విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ ఫుల్ కొలాబరేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి బరిలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్‌ని మేకర్స్ వినూత్న రీతిలో నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకు పోటీగా ‘డాకు మహారాజ్’, ‘గేమ్ చేంజర్’ వంటి భారీ సినిమాలు ఉన్నా.. ప్రమోషన్స్ పరంగా మాత్రం ఈ సినిమా పీక్‌లో ఉంది. అనిల్ రావిపూడి తనదైన తరహా కామెడీ ప్రమోషన్స్‌తో ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళుతున్నారు. తాజాగా సినిమా టీమ్‌తో ఆయన చేసిన వీడియో అయితే.. హిలేరియస్ అంతే. మరెందుకు ఆలస్యం ఆ హిలేరియస్ కామెడీ వీడియోని మీరూ చూసేయండి.