Mastan Sai: మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు
ABN, Publish Date - Feb 05 , 2025 | 12:38 PM
రాజ్ తరుణ్, లావణ్య కేసులో సోమవారం మస్తాన్ సాయి అనే వ్యక్తిని నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన రిమాండ్ రిపోర్ట్ ను ఏబీఎన్ బయట పెట్టింది.
ఈ రిపోర్టు ప్రకారం అమ్మాయిల నగ్న వీడియోలతో మస్తాన్ సాయి బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. అలాగే మొబైల్ ఫోన్ నుండి ప్రైవేట్ పార్టీ వీడియోలను చిత్రీకరించినట్లు బయటపడింది. వీడియో కాల్ రికార్డింగ్‌లు, రికార్డ్ వీడియోలు సైతం మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ ల్లో బయటపడ్డాయి. మస్తాన్ సాయి మొత్తం 40 వీడియో కాల్స్‌ను రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఇవన్నీ బాధితుల సమ్మతి లేకుండా రికార్డ్ చేశాడు.