Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ వేడుక
ABN, Publish Date - Jan 10 , 2025 | 08:28 PM
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ మూవీ ఈ సంక్రాంతి బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై అంచనాలను పెంచేయగా.. తాజాగా మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో అలరించనున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు. సంక్రాంతి కానుకగా జనవరి 12న 'డాకు మహారాజ్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ మీకోసం..
Also Read-Allu Arjun: బన్నీ మాస్టర్ ప్లాన్.. ఇక ఆపేవాడే లేడు
Also Read-Yearender 2024 ఆర్టికల్స్..
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Jan 11 , 2025 | 02:51 PM