Thandel Jaathara Event: ‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (లైవ్)
ABN, Publish Date - Feb 02 , 2025 | 07:14 PM
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, డ్యాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి జంటగా.. ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న చందూ మొండేటి రూపొందిస్తోన్న చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్.. చూసేయండి.
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, డ్యాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి జంటగా నటించిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలయ్యేందుకు ముస్తాబైంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేయగా.. ఆదివారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ‘తండేల్ జాతర ఈవెంట్’ పేరుతో మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ వేడుకకు పబ్లిక్‌కు ఎంట్రీ లేదు. కేవలం ప్రసార మాధ్యమాలలో మాత్రమే చూడాలని చిత్రయూనిట్ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ మీకోసం..