Manchu Manoj: ఇది జస్ట్ టీజర్ మాత్రమే..
ABN, Publish Date - Jan 20 , 2025 | 11:56 PM
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ కాంబోలో రూపుదిద్దుకుంటోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సోమవారం ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ కాంబోలో రూపుదిద్దుకుంటోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’. ఈ మూవీ టీజర్‌ని సోమవారం విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో మనోజ్ మంచు మాట్లాడుతూ.. విజయ్ ఈ కథ చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది. ఇందులో నా బ్రదర్ రోహిత్, సాయి ఉన్నారని చెప్తే ఇంకా ఎక్సైట్ అయ్యాను. వెంటనే ఒప్పేసుకున్నాను. డైరెక్టర్ విజయ్ చాలా డెడికేటెడ్‌గా ఈ సినిమాని తీశారు. ఆయన హార్డ్ వర్క్‌కి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. నిర్మాతలు రాధా మోహన్ గారికి, శ్రీధర్ గారికి థాంక్యూ సో మచ్. తమ్ముడు సాయి సొంత్ బ్రదర్ లానే. ఈ సినిమా చూశాను. సాయి పెర్ఫార్మెన్స్ చించి పారేశాడు. ఈ సినిమా గొప్ప విజయం కావాలని మా అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.
Also Read-Sachin Daughter Sara: నా సీక్రెట్స్ అన్నీ వాడికి తెలుసు.. వాడే నా ప్రాణం
రోహిత్ బాబాయ్ నాకు చిన్నప్పటి నుంచి క్లోజ్. ఈ సినిమాతో ఇంకా క్లోజ్ అయిపోయాం. ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా 2016లో చేసినప్పుడు రోహిత్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఆ గ్యాప్ లో అది నా లాస్ట్ ఫిల్మ్. ఇప్పుడు మళ్లీ ‘భైరవం’ టైటిల్‌తో రోహిత్ తో కలిసి సినిమా చేయడం ఆనందంగా ఉంది. తను అద్భుతంగా పెర్ఫాం చేశాడు. తనతో కలిసి స్టెప్స్ వేయడం చాలా ఆనందంగా ఉంది. అతిది సింగర్, మంచి డాన్సర్. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది జస్ట్ టీజర్ మాత్రమే. ట్రైలర్ అదిరిపోతుంది. సినిమా దుమ్ము లేచిపోతుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నానని అన్నారు.
Also Read-Pushpa 2: సంధ్యలో పుష్ప గాడి ర్యాంపేజ్..
Also Read-Chiranjeevi - Venkatesh: చిరంజీవి తర్వాత వెంకటేష్..
Also Read-Hari Hara Veera Mallu: పవన్ అంటే భయం లేదా..
Also Read-Balakrishna: బాలయ్య సెంటిమెంట్ ఏంటో తెలుసా
మా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Jan 20 , 2025 | 11:59 PM