Manchu Manoj: రేయ్ ఎలుగుబంటు.. ఎవడ్రా నువ్వు? వీడియో వైరల్
ABN, Publish Date - Jan 15 , 2025 | 04:43 PM
మంచు ఫ్యామిలీ వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. కాకపోతే ఈసారి తెలంగాణ నుండి ఏపీకి షిఫ్ట్ అయింది. ఇటీవల హైదరాబాద్‌లో మంచు ఫ్యామిలీ మధ్య విభేదాలు ఏ స్థాయికి చేరాయో తెలిసిందే. మమ్మల్ని కదిలించవద్దంటూ కోర్టుల నుండి ఆర్డర్స్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడే సేమ్ సీన్ ఏపీలో రిపీటవుతోంది.
మంచు ఫ్యామిలీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కాకపోతే ఈసారి ఏపీలో. ఇటీవల హైదరాబాద్‌లో మోహన్ బాబు ఇంటి వద్ద ఎలాంటి ఉద్రిక్తత నెలకొందో, పోలీసులు వారికి ఎలాంటి హుకుం జారీ చేశారో తెలియంది కాదు. ఇక హైదరాబాద్‌లో ఎందుకని అనుకున్నారో, ఏమో.. ఇప్పుడు మ్యాటర్‌ని ఏపీకి షేర్ చేశారు. ఏపీలో సేమ్ ఇక్కడ హైదరాబాద్‌లో ఎలాంటి సీన్ అయితే రిపీట్ అయ్యిందో.. అలాంటి సీనే ఒకటి రిపీట్ అయింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో గేటుకి ఇటు వైపు ఉన్న మంచు మనోజ్, అటు వైపు ఉన్న ఒక పర్సన్‌ని ఓరేయ్ ఎలుగు బంటు.. ఎవడ్రా నువ్వు? అంటూ కేకలు వేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం టాక్ ఆఫ్ ద ఏపీగా మారింది. అసలు విషయం ఏమిటంటే..
Also Read-Sankranthiki Vasthunnam Review: వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఎలా ఉందంటే
బుధవారం ఉదయం నుంచి మోహన్ బాబు తిరుపతి కాలేజ్ వద్ద తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది. మోహన్ బాబు కాలేజ్‌కు మనోజ్ వస్తారన్న సమాచారంతో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే మంచు మోహన్ బాబు, విష్ణు కాలేజ్ వద్దే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. నేను గొడవ చేయడానికి రావడం లేదని, నానమ్మ-తాతయ్యలకు నమస్కారం చేసుకునేందుకు వచ్చానని మనోజ్ చెప్పినా, పోలీసులు ఆయన్ని లోపలికి అనుమతించలేదు. గేటు బయటే కాసేపు హడావుడి చేసిన మనోజ్, ఆ తర్వాత పోలీసు వారి హెచ్చరికతో అక్కడి నుండి వెళ్లిపోయారు.