Vishwak Sen X Chiranjeevi: లైలా మెగా మాస్ ఈవెంట్ లైవ్

ABN, Publish Date - Feb 09 , 2025 | 08:03 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అప్ కమింగ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘లైలా’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ‘లైలా’ చిత్రం ఫిబ్రవరి 14న విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను దర్శకుడు రామ్ నారాయణ్ పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించగా.. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం స్పెషల్‌గా థియేటర్లలోకి రాబోతోన్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ తొలిసారి లేడీ గెటప్‌లో కనిపిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు బాగానే క్రియేట్ అయ్యాయి. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ క్రేజ్‌ని పెంచగా.. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్విస్తున్నారు.

Updated at - Feb 09 , 2025 | 08:04 PM