Nandamuri Balakrishna: 'అఖండ 2'లో పద్మ భూషణుడికి ఘన సత్కారం
ABN, Publish Date - Jan 27 , 2025 | 09:54 PM
Nandamuri Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna)ను రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలోని మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మ భూషణ్’ (Padma Bhushan) వరించింది. సినిమా పరిశ్రమకు అలాగే ఆయన చేస్తున్న రాజకీయ, సామాజిక సేవను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం ఆయనని ‘పద్మ భూషణ్’ అవార్డుకు నామినేట్ చేయగా.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డ్స్ 2025లో ఆయనకు చోటు దక్కింది. దీంతో బాలయ్య పద్మ భూషణుడిగా మారారు.
ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న 'అఖండ 2' మూవీ ఆయనకు ఘనంగా సత్కరించింది. పూల మాల, బొకే, శాలువాలతో సత్కరించారు. అలాగే కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు మూవీ యూనిట్ అంతా పాల్గొంది. ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎం తేజస్విని సమర్పిస్తున్నారు. సీక్వెల్‌ను భారీ బడ్జెట్‌తో బిగ్ కాన్వాస్‌పై నిర్మిస్తున్నారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఇద్దరికీ ఇదే మొదటి పాన్ ఇండియా చిత్రం. ఈ సినిమాను 25 సెప్టెంబర్, 2025న దసరా సందర్భంగా థియేటర్లలోకి తెచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.