Emergency: మోస్ట్ కాంట్రవర్షియల్ ట్రైలర్..

ABN, Publish Date - Jan 07 , 2025 | 09:09 AM

Emergency: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ‘ఎమర్జెన్సీ’ చిత్రం తెరకెక్కింది. భారతదేశంలో చీకటి రోజులుగా పిలిచే ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ఈ చిత్రంలో చూపించారు. ఇందులో కంగనా.. ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనున్నారు.

కంగనా రనౌత్‌ (Kangana Ranaut) నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎమర్జెన్సీ (Emergency)’. ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సినిమాకు విముక్తి కలిగింది. ఈ చిత్రం జనవరి 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ రెండవ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీలో అనుపమ్‌ ఖేర్‌, మహిమా చౌదరి కీలక పాత్రలు పోషించారు.

Updated at - Jan 07 , 2025 | 09:17 AM