Daaku Maharaaj Trailer: ఏంట్రా వీడు ఇంత ఫ్రస్ట్రేషన్‌గా ఉన్నాడు..
ABN, Publish Date - Jan 05 , 2025 | 09:51 AM
నందమూరి బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలు. బాబీ దేవోల్, చాందిని చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. బాలయ్య నటన, యాక్షన్ సన్నివేశాల్లో ఆయన పెర్ఫార్మెన్స్, సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి.