ARI: అనసూయ భరద్వాజ్ 'భగ భగ..' లిరికల్ సాంగ్
ABN, Publish Date - Apr 05 , 2025 | 05:34 PM
అనసూయ భరద్వాజ్, వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అరి’. 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక. 'పేపర్ బాయ్' చిత్రంతో దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, డా.తిమ్మప్ప నాయుడు నిర్మిస్తున్నారు. శనివారం ఈ సినిమా నుంచి 'భగ భగ..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను అనూప్ రూబెన్స్ ఫైర్ ఉన్న బీట్ తో కంపోజ్ చేయగా..వనమాలి సాహిత్యం అందించారు, షణ్ముక ప్రియ, రోహిత్ పీవీఎన్ఎస్ ఇంటెన్స్ గా పాడారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ను మూవీ టీమ్ అనౌన్స్ చేయనుంది.