Vishwak Sen: గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశా.. ఎప్పుడు దొరికితే అప్పుడే..
ABN, Publish Date - Apr 28 , 2025 | 01:10 PM
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ( Vishwak Sen) తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. నాని హీరోగా, నిర్మాతగా వ్యవహరించిన ‘హిట్ 3’ (Hit 3) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ( Vishwak Sen) తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. నాని హీరోగా, నిర్మాతగా వ్యవహరించిన ‘హిట్ 3’ (Hit 3) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ వేదికపై విశ్వక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేడకలో భాగంగా యాంకర్ సుమ ఆయన్ను సరదాగా ఇంటరాగేషన్ చేశారు. ఆఫీసర్‌నే ఇంటరాగేషన్ చేస్తారా? అంటూ సుమను ఎదురు ప్రశ్నించగా ఇప్పుడు ఆఫీసర్ అర్జున్ సర్కార్ కదా.. అని సుమ అన్నారు. దీనికి ‘మా తెలంగాణ బ్రాంచ్‌లో నేనే కదా ఆఫీసర్‌ను’ అని విశ్వక్ కామెంట్ చేశారు. ‘అర్జున్ సర్కార్(Nani), విక్రమ్‌లో లేని క్వాలిటీ ఏంటని మీరు అనుకుంటున్నారు.’ అన్న ప్రశ్నకు విశ్వక్.. ‘ఫిట్టింగ్ ఇది. ఇద్దరిలో ఉండే ప్రశాంతత. కామ్ నెస్’ అంటూ సమాధానం ఇచ్చారు.
ఇక పెళ్లి విషయానికి రాగానే ‘మా అమ్మకు సంబంధాలు చూడమని మొన్ననే గ్రీన్ సిగ్నల్ (Vishwak Sen Marriage) ఇచ్చేశాను. సో.. ఎప్పుడు దొరికితే అప్పుడు.’ అంటూ సమాధానం ఇచ్చారు. విశ్వక్‌సేన్. ఆయన మాటలకు స్టేడియంలో అభిమానులంతా ఈలలు, కేకలతో దద్దరిల్లిపోయేలా సందడి చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు విశ్వక్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు.
అనంతరం ‘హిట్ 3’ మూవీ గురించి మాట్లాడారు. ‘హిట్.. నాది, శేషుది, నాని అన్నది. హిట్ మాది.. మన అందరిదీ. ఇదే స్టేజీ మీద నాని అన్న హిట్ 1లో నేను హీరోనని అనౌన్స్ చేశారు. ఆ రోజు కూడా నాకు సపోర్ట్ చేేసందుకు రాజమౌళిగారు వచ్చారు. హిట్ యూనివర్స్ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్యూ సార్. నాని అన్నకు హిట్ 3 బిగినింగ్ ఆఫ్ సెకండ్ హ్యాట్రిక్. నిర్మాతగా, నటుడిగా నాని ఎన్నో విజయాలు అందుకున్నారు. ‘హిట్ 3’తో ఇంకా పెద్ద హిట్ అందుకోబోతున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తోన్న చిత్రమిది. ఇప్పటికే ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘హిట్ 3’లో వయలెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి.. మే 1న థియేటర్లలో చిన్న పిల్లలు దూరంగా ఉండాలని విశ్వక్ సూచించారు. ‘హిట్ 3 నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. ఫలక్‌నుమా దాస్ రిలీజ్ అయిన 6 నెలల్లో హిట్ రిలీజ్ అయ్యింది. నా ఎదుగుదలలో మేజర్ సినిమా ఇది’’ అని అన్నారు.