Chiranjeevi - Venkatesh: చిరంజీవి తర్వాత వెంకటేష్..

ABN, Publish Date - Jan 19 , 2025 | 05:17 PM

Chiranjeevi - Venkatesh: "బాలకృష్ణ, నాగార్జున ఇంకా ఆ రికార్డును అందుకోకపోవడం గమనార్హం. వాస్తవానికి తన యాక్టింగ్ తో క్లాస్ తో కన్నీళ్లు, మాస్ తో విజిల్స్ వేయించే వెంకీ మామ ఈ రికార్డు అందుకోవడంలో ఎలాంటి అనుమానం లేదు. "

Venkatesh Joins Elite Club After Chiranjeevi

సీనియర్ హీరోలలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇండస్ట్రీకి నాలుగు మూల స్తంభాలుగా చెబుతారు. అయితే ఈ నలుగురిలో చిరు మాత్రమే ఓ అరుదైన రికార్డును అందుకోగా, తాజాగా ఆ జాబితాలోకి వెంకటేష్ ఎంట్రీ ఇచ్చాడు. బాలకృష్ణ, నాగార్జున ఇంకా ఆ రికార్డును అందుకోకపోవడం గమనార్హం. వాస్తవానికి తన యాక్టింగ్ తో క్లాస్ తో కన్నీళ్లు, మాస్ తో విజిల్స్ వేయించే వెంకీ మామ ఈ రికార్డు అందుకోవడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే..


టాలీవుడ్ నుండి సీనియర్ హీరోలలో రూ. 200 కోట్ల బాక్సాఫీస్ క్లబ్ లోకి అడుగుపెట్టింది కేవలం చిరంజీవి మాత్రమే. ఆయన సైరా నరసింహారెడ్డి మూవీ ప్రపంచ వ్యాప్తంగా 244 కోట్లు, వాల్తేర్ వీరయ్య 232 కోట్లతో రెండు సార్లు ఈ అరుదైన రికార్డును అందుకున్నాయి. ఆ తర్వాత ఇంకా ఏ సీనియర్ హీరో ఈ ఫీట్ ని అందుకోలేకపోయారు. మాస్ పల్స్ బాగా తెలిసిన బాలకృష్ణ కూడా ఈ రికార్డును సాధించలేకపోయాడు. ఆయన వీర సింహారెడ్డి రూ. 132 కోట్లు, అఖండ రూ. 132 కోట్లతో హయ్యెస్ట్ గ్రాసర్స్ గా నిలిచాయి. నాగార్జున ఈ రికార్డులకు చాలా దూరంలో ఉన్నాడు. కానీ ఈ సంక్రాంతి విన్నర్ వెంకీ మామ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.


బాలయ్య రికార్డులను చెరిపేస్తూ.. వెంకటేష్ రూ. 200 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టనున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఐదు రోజుల్లోనే రూ. 161 కోట్లు కొల్లగొట్టింది. మరో వారం రోజుల్లో ఈ సినిమా రూ. 200 కోట్లు క్రాస్ చేయడం కేక్ వాక్ అంటున్నారు ట్రేడ్ పండితులు. దీంతో చిరు తర్వాత రూ. 200 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ కానున్న రెండో సీనియర్ హీరోగా వెంకటేష్ రికార్డ్ సాదించనున్నాడు.


Also Read-Manchu Manoj: నా పోరాటం ఎందుకంటే.. ఓహో ఇదన్నమాట అసలు విషయం!

Also Read-Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌కు సారీ చెప్పిన బాలయ్య ‘డాకు’ బ్యూటీ.. మ్యాటరిదే!

Also Read-Madhavi Latha: ఈ రోజుల్లో పతివ్రతలు ఎవరు లేరమ్మా.. మాధవీ లత షాకింగ్ కామెంట్స్

Also Read:Manchu Manoj: సింగిల్‌గా వస్తా.. ఎంతమందిని తెచ్చుకుంటావో తెచ్చుకో..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 19 , 2025 | 05:20 PM