Venky- Allu arjun : టీఆర్పీ లో వెంకీ నే టాప్... వెనకపడ్డ పుష్పరాజ్
ABN, Publish Date - Apr 25 , 2025 | 11:25 PM
సంక్రాంతికి వస్తున్నాం ను బీట్ చేయలేకపోయాడు పుష్పరాజ్. వెండితెరపై రూ. 1871 కోట్లుతో టాప్ లో నిలిస్తే... బుల్లితెరపై మాత్రం విక్టరీ మామను వెనకకు నెట్టలేకపోయాడు.
ఓటీటీ హవా మొదలైన తర్వాత టీవీల రీచ్ కాస్త డౌన్ అయింది. బిగ్ సినిమాల టీఆర్పీ రేటింగ్ లు (TRP)కూడా 6-7 చుట్టూ తిరుగుతున్నాయి. థియేటర్లలో బ్లాక్‌బస్టర్ అయినా సరే, టీవీల్లో మాత్రం ఈ దుస్థితి తప్పడం లేదు. ఒకప్పుడు 20 ప్లస్ టీఆర్పీ రేటింగ్‌లు కనిపించేవి. కానీ ఇప్పుడు బ్లాక్‌బస్టర్ మూవీ కూడా టీఆర్పీ రేటింగ్ 10 దాటితే గొప్ప అన్నట్టుగా తయారైంది. అయితే, ఓటీటీ హవాలోనూ టీఆర్పీ రేటింగ్‌లలో పుష్ప-2 తాజాగా అదరగొట్టింది.
తాజాగా బుల్లితెరపై ఈ సినిమాకు 12.6 టీఆర్పీ వచ్చింది. రీసెంట్ బిగ్ మూవీస్‌తో కంపేర్ చేస్తే ఇది డీసెంట్. కానీ టీఆర్పీ హిస్టరీలో చూస్తే, పుష్ప-2 (Pushpa 2) చాలా వెనకబడింది. అయితే, రీసెంట్‌గా వెంకీ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమాను బీట్ చేస్తుందని అందరూ అంచనా వేశారు. ఆ సినిమా ఏకంగా 18.1 టీఆర్పీ సాధించి షాకిచ్చింది. పుష్ప-2 దాన్ని బీట్ చేస్తుందని అంతా ఫిక్స్ అయ్యారు, కానీ రేటింగ్స్‌లో వెనకబడిపోయింది.
వాస్తవానికి అల్లు అర్జున్ (Allu Arjun) సినిమాలకు టీవీల్లో మంచి ఆదరణ కనిపిస్తూ ఉంటుంది. ‘అల వైకుంఠపురములో ’ (Ala Vaikunthapurramuloo) , ‘పుష్ప-1’ (Pushpa-1) లాంటి సినిమాలు ఏకంగా 20 ప్లస్ టీఆర్పీలు సంపాదించాయి. కానీ ఆ లిస్ట్‌లో పుష్ప-2 స్థానం సంపాదించలేకపోయింది. అయినా, పుష్ప-2, ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి సినిమాలు టీవీ వీక్షకుల సంఖ్యను కాస్త పెంచి, సినిమా శాటిలైట్ మార్కెట్‌కు కొత్త జోష్ ఇచ్చాయి. ఇది ఇండస్ట్రీకి పాజిటివ్ సిగ్నల్ అని చెప్పొచ్చు.