MAD Square : ఏసుకోండ్రా మీమ్స్, చేసుకోండ్రా రీల్స్..

ABN, Publish Date - Mar 18 , 2025 | 04:59 PM

'మ్యాడ్' సినిమాకి సీక్వెల్ గా రూపొందుతోన్న 'మ్యాడ్ స్క్వేర్' నుంచి విడుదలైన 'లడ్డు గానీ పెళ్లి', 'స్వాతి రెడ్డి' పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా  చిత్రం నుంచి మూడో గీతం 'వచ్చార్రోయ్' విడుదలైంది.

'మ్యాడ్' సినిమాకి సీక్వెల్ గా రూపొందుతోన్న 'మ్యాడ్ స్క్వేర్' (MadSquare) నుంచి విడుదలైన 'లడ్డు గానీ పెళ్లి', 'స్వాతి రెడ్డి' పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా  చిత్రం నుంచి మూడో గీతం 'వచ్చార్రోయ్' (VACCHARROI Song) విడుదలైంది. సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో స్వరపరచి, ఈ పాటను స్వయంగా ఆలపించగా.. ప్రతిభావంతులైన దర్శకుడు కె.వి. అనుదీప్ సాహిత్యం అందించడం విశేషం.  భీమ్స్ సిసిరోలియో (Bheems) తనదైన ప్రత్యేక శైలి సంగీతంతో మరోసారి కట్టిపడేశారు. "ఏసుకోండ్రా మీమ్స్, చేసుకోండ్రా రీల్స్, రాసుకోండ్రా హెడ్ లైన్స్.. ఇది మ్యాడ్ కాదు మ్యాడ్ మ్యాక్స్" వంటి పంక్తులతో అందరూ పాడుకునేలా గీతాన్ని రాశారు. యువత కాలు కదిపేలా ఉన్న ఈ గీతం, విడుదలైన కొద్దిసేపటిలోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

మొదటి భాగంలో తమ అల్లరితో నవ్వులు పూయించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ త్రయం.. 'మ్యాడ్ స్క్వేర్'లో అంతకుమించిన అల్లరి చేయబోతున్నారు. ప్రియాంక జవాల్కర్, మురళీధర్ గౌడ్, కె.వి. అనుదీప్ కీలక పాత్రలలో అలరించనున్నారు. అలాగే, రెబా మోనికా జాన్ ప్రత్యేక గీతంలో సందడి చేయనున్నారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మార్చి 28న 'మ్యాడ్ స్క్వేర్' సినిమా విడుదల కానుంది.

Updated Date - Mar 18 , 2025 | 05:03 PM