Urvashi Rautela: పొగడ్తలు అనుకోని ట్రోల్స్‌ని షేర్ చేసిన హీరోయిన్.. దబిడి దిబిడే

ABN, Publish Date - Jan 04 , 2025 | 12:10 PM

అయితే సదరు ట్రోల్స్‌ను ఊర్వశీ పొగడ్తలు అనుకుందో ఏమో.. వరుసగా ఏ ఒక్క మీమ్‌ను వదలకుండా ఇన్స్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసుకుంది.

urvashi rautela

బాలకృష్ణ 'డాకు మహారాజ్' సినిమా నుండి దబిడి దిబిడే సాంగ్ రిలీజ్ తర్వాత నెటిజెన్స్ రియాక్షన్స్ రకరకాలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఫన్నీ మీమ్స్, ట్రోల్స్ ఈ పాటపై ఎక్కువగా క్రియేట్ అయ్యాయి. అయితే సదరు ట్రోల్స్‌ను ఊర్వశీ పొగడ్తలు అనుకుందో ఏమో.. వరుసగా ఏ ఒక్క మీమ్‌ను వదలకుండా ఇన్స్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసుకుంది.



ఆమెకు తెలుగు అర్దంకాకపోవటంతో ట్రోల్స్‌ను పొగడ్తలు అనుకుని షేర్ చేస్తోందని నెటిజెన్స్ పోస్ట్లు చేయటంతో రియలైజ్ అయిన ఊర్వశీ వాటిని డిలీట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఊర్వశీ పోస్ట్‌లే కనిపిస్తున్నాయి. అయితే ఈ ట్రోలింగ్ వల్ల దబిడి దిబిడి సాంగ్ కు మిలియన్స్ లో వ్యూస్ లభిస్తున్నాయి. ఇంతకముందు చిన్నీ అంటూ డాకు మహారాజ్ నుంచి వచ్చిన మంచి పాటను ఎవరు పట్టించుకోలేదని.. దబిడి దిబిడి పాట లో బాలయ్య దరువులపై చర్చ జరగటంతో.. పాటకు మంచి రీచ్ లభించిందనే చర్చ నడుస్తోంది..

Updated Date - Jan 04 , 2025 | 12:14 PM