Ravi Teja: మాస్ జాతర నుండి మొదటి గీతం...

ABN, Publish Date - Apr 14 , 2025 | 04:54 PM

రవితేజ, శ్రీలీల తాజా చిత్రం 'మాస్ జాతర' లోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది. ఈ పాట కోసం దివంగత చక్రి గాత్రాన్ని ఎ.ఐ. ద్వారా మేకర్స్ రీ-క్రియేట్ చేశారు.

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర' (Mass Jathara). భాను భోగవరపు (Bhanu Bhogavarapu) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి మొదటి గీతంగా 'తు మేరా లవర్'ను విడుదల చేశారు. 'ధమాకా' జోడి రవితేజ (Ravi Teja) -శ్రీలీల (Srileela) అందరి అంచనాలను అందుకునేలా, అద్భుతమైన కెమిస్ట్రీతో మరోసారి మ్యాజిక్ చేశారు. ప్రేక్షకులకు వెండితెరపై పూర్తి స్థాయి ట్రీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ పాటతో చెప్పకనే చెప్పేశారు.


సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) 'తు మేరా లవర్' గీతాన్ని స్వరపర్చగా, భాస్కరభట్ల రవికుమార్ (Bhaskarabhatla Ravi Kumar) సాహిత్యం సమకూర్చారు. విశేషం ఏమంటే ఈ పాటను రవితేజ బ్లాక్‌బస్టర్ మూవీ 'ఇడియట్‌' (Idiot) లోని ఐకానిక్ చార్ట్‌బస్టర్ "చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే" పాటకు ట్రిబ్యూట్ గా మలిచారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సంగీత దర్శకుడు చక్రి (Chakri) స్వరాన్ని తిరిగి సృష్టించారు. దాంతో పాటకో కొత్త విలువ చేకూరింది. దర్శకుడు భాను బోగవరపు... రవితేజ అభిమానులతో పాటు, మాస్ ప్రేక్షకులు మెచ్చే విధంగా 'మాస్ జాతర'ను మలుస్తున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు విధు అయ్యన్న తన ప్రభావవంతమైన విజువల్స్ తో పాటకి తగ్గట్టుగా మాస్ వైబ్‌ను అద్భుతంగా చూపించారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.

Also Read: Prithviraj: కొత్త సంవత్సరం కొత్త ముచ్చట...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 14 , 2025 | 04:54 PM