Tragedy in Tollywood: ప్రముఖ నిర్మాత మృతి.. ఎవరంటే!
ABN, Publish Date - Jan 31 , 2025 | 09:17 AM
ప్రముఖ నిర్మాత మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అల్లరి నరేష్ వంటి హీరోతో సినిమాలు చేసిన నిర్మాత వేదరాజు టింబర్ శుక్రవారం అకాల మరణానికి గురయ్యారు. ఆయన మరణానికి సంతాపం ప్రకటిస్తూ.. ఇండస్ట్రీ నివాళులు అర్పిస్తోంది.
ప్రముఖ నిర్మాత మృతితో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ నిర్మాత ఎవరంటే.. అల్లరి నరేష్‌తో ‘మడత కాజా‘, ‘సంఘర్షణ‘ వంటి చిత్రాలను నిర్మించిన నిర్మాత వేదరాజు టింబర్ (54) శుక్రవారం ఉదయం మృతిచెందారు. సినిమాలపై ఇష్టంతో ఓ వైపు కనస్ట్రక్షన్ రంగంలో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలను నిర్మించిన నిర్మాత వేదరాజు టింబర్. త్వరలో మరో చిత్ర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలోనే ఆయన అకాల మరణం ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టివేసింది.
Also Read- Kiss Scene: ఆ ముద్దు సీన్ ట్రిమ్ చేశారు.. పాపం పూజా హెగ్డే?
గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఎఐజి హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న వేదరాజు.. త్వరలోనే కోలుకుని క్షేమంగా తిరిగి వస్తారని ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు భావిస్తున్న తరుణంలో.. సడెన్‌గా ఇలా జరగటం వారందరిలో విషాదాన్ని నింపింది. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. అంత్య క్రియలు శుక్రవారమే జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. నిర్మాత వేదరాజు టింబర్ మృతికి టాలీవుడ్ ఇండస్ట్రీ నివాళులు అర్పిస్తూ.. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు.