Game Changer: ‘గేమ్ చేంజర్’కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఎవరూ ఊహించి ఉండరు కదా..
ABN, Publish Date - Jan 08 , 2025 | 10:37 PM
ఒక వైపు ఏపీలో ‘గేమ్ చేంజర్’ సినిమాకు ఏం కావాలంటే అది ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. తెలంగాణలో మాత్రం రీసెంట్‌గా జరిగిన ఘటనతో కొన్ని ఆంక్షలు ఉండటంతో.. ‘గేమ్ చేంజర్’ సినిమాకు టికెట్ల రేట్లు పెంచడం కష్టమే అని అంతా అనుకుంటున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం చిత్రయూనిట్‌కు, ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. అదేమంటే..
‘పుష్ప 2’ సంధ్య థియేటర్ ఘటన తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ వ్యాప్తంగా బెనిఫిట్ షోలకు, టికెట్ల ధరల పెంపుకు అనుమతి ఉండదని ఖరాఖండీగా చెప్పిన విషయం తెలిసిందే. రీసెంట్‌గా సినీ పెద్దల సమక్షంలో కూడా ఆయన ఇదే విషయాన్ని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేదు కానీ.. ‘గేమ్ చేంజర్’కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ‘గేమ్ చేంజర్’ టికెట్ల రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.
‘గేమ్ చేంజర్’ సినిమాకు జనవరి 10వ తేదీ ఒక్కరోజు ఉదయం 4 గంటల నుంచి 6 షోలకు అనుమతిని ఇచ్చిన ప్రభుత్వం, జనవరి 11 నుంచి జనవరి 19వ తేదీ వరకు 9 రోజుల పాటు 5 షోలకు అనుమతి ఇచ్చింది. జనవరి 10 తేదీన నిర్వహించే 6 షోలకు టికెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటును కల్పించింది. ఆ ఒక్క రోజు మల్టీప్టెక్స్ థియేటర్లలో రూ. 150, సింగిల్ స్ర్కీన్ థియేటర్లలో రూ. 100 పెంచుకునేందుకు అనుమతి జారీ చేసింది. జనవరి 11 నుండి జనవరి 19 వరకు 9 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో రూ. 100 రూపాయలు పెంచుకునేలా వెసులు బాటుని కల్పించిన ప్రభుత్వం.. ఎటువంటి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేదు. ఈ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో నార్కోటిక్, డ్రగ్స్ మరియు సైబర్ క్రైమ్ వంటి వాటిపై అవగాహన కల్పించే ప్రయత్నాలు చేయాలని ఆర్డర్స్ జారీ చేసింది.
Also Read-Kabir Duhan Singh: పేరుకే విలన్.. ఈ నటుడు చేసేది తెలిస్తే ఫ్యాన్ అయిపోతారు
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవోతో మెగా ఫ్యాన్స్ అంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిత్రయూనిట్ కూడా సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధమైంది.