Game Changer: 'ఒక్కడు', 'పోకిరి' శంకర్ వెర్షన్‌లో తీస్తే 'గేమ్ ఛేంజర్'

ABN, Publish Date - Jan 02 , 2025 | 07:00 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ శంకర్, రాజమౌళి, హీరో రామ్ చరణ్, ప్రొడ్యూసర్ దిల్ రాజుల స్పీచ్ లు హైలెట్‌గా నిలిచాయి. ఎవరెవరు ఏం అన్నారంటే..

Rajamouli, Shankar , Ram Charan, Dil Raju speaches at game changer trailer launch event

తమిళ సినిమాను పాన్ ఇండియా సినిమాగా చేసిన శంకర్ గారు, తెలుగు సినిమాను గ్లోబల్ సినిమాగా మార్చిన రాజమౌళి గారికి సినిమావారిగా నా కృతజ్ఞతలు. మీరు వేసిన పాత్ లో వెళుతున్నాము. శంకర్ గారి గ్రాండియర్ ఒక్కోక్కటిగా చూపిస్తూ ప్రమోట్ చెస్తున్నాము. ఈ సినిమాలో మూమెంట్స్ అన్ ప్రిడిక్టబుల్‌గా ఉంటాయి. రామ్ చరణ్ నటనకు గ్లోబల్ స్థాయిలో ప్రశంసలు లభిస్తాయి. మహేష్ బాబు, రాజమౌళి గారి సినిమా కోసం మూడేళ్లయినా వెయిట్ చేస్తాం.

దిల్ రాజు

ఒక్కడు, పోకిరి తరహాలో ఓ సినిమా చేయాలని నా స్టైల్ లో గేమ్ ఛేంజర్ చేశాను. ఓ గవర్నమెంట్ ఆఫీసర్ కు పొలిటీషన్ మధ్య జరిగే కథ. బ్యాక్ ఎండ్ స్టోరీ సినిమాలో కీలకం. ఇది శంక్రాంతి అంటున్నారు.. కానీ నేను చెబుతున్నాను ఇది రామనవమి. రామ్ చరణ్ నటన ఈ సినిమాకే హైలైట్. సాంగ్స్ కోసం రామ్, కియరా పోటీ పడ్డారు. అంజలి, ఎస్ జె సూర్య బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. శ్రీకాంత్ గారు తన పాత్రకు వెయిట్ ఇచ్చారు. సముద్రగని రియలిస్టిక్ గా చేశేస్తారు. రాజు గారు ఎదడిగినా ఓకే అని సపోర్ట్ చేశారు. అన్నీ విషయాలపై అవగాహన ఉన్న నిర్మాత. రెహ్మాన్ గారి రేంజ్ లో తమన్ వర్క్ చేశాడు‌. కొత్త షాట్స్ ట్రై చేసాము. తెలుగు నెటివీటి ఉండాలని టీమ్ కు చెప్పాను. ఈ జనరేషన్ అంతా స్పీడ్ ను ఇష్టపడతారు. రేసి స్క్రీన్ ప్లే ఉంటుంది. కార్తీక్ సుబ్బరాజు కథ ఇచ్చాడు.‌ సాయిమాధవ్ బుర్రా పవర్ ఫుల్ మాటలు రాశారు. జరగండి పాటకు ప్రభుదేవా.. రామ్ చరణ్, దిల్ రాజు మీద ఉన్న అభిమానంతో పేమెంట్ లేకుండా చేశారు. పాటల్లో ప్రయోగాలు చేశాము. రాజమౌళి గారు హాలీవుడ్ సినిమాను మనవైపు చూశేలా చేశారు. వారి ద్వారా నా సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది.

శంకర్


శంకర్ గారు మీరంటే విపరీతమైన గౌరవం. మేమందరం స్పూర్తి గా ఫీలయ్యే దర్శకుడు శంకర్ గారు. ఎంతోమందికి దర్శకుల ఆశలకు పునాది వేసింది శంకర్ గారు. ది రియల్ ఓజీ. గేమ్ ఛేంజర్ ట్రైలర్ లో వింటేజ్ శంకర్ గారు కనిపించారు. నాకు ఒకే ఒక్కడు ఎంతో ఇష్టం. ట్రైలర్ లో ఎన్నో షాట్స్ ఎగ్జైట్మెంట్ కలిగించాయి. చరణ్ నా బ్రదర్..‌ ఎంత డెవలెప్ అయిపొయాడో. మగధీర..‌ఆర్ఆర్ఆర్ కు ఎంతో మార్పు వచ్చింది. నేను అతన్ని హీరో అని పిలుస్తాను. మాస్ ఎలివేషన్, ఎమోషన్స్, డాన్స్ ఎదైనా చేయగలడు. జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజ్ కోసం ఎదురుచూద్దాం.

రాజమౌళి

శంకర్ గారు ఊహించని దానికంటే అద్బుతమైన సీన్స్ చేస్తారు. రాజమౌళి, శంకర్ ఇద్దరు టాస్క్ మాస్టర్స్. వీరి ఇద్దరు మోటివేటర్స్.. ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారు.. స్కోప్ ఇస్తారు. నేను ఈ పాత్ర కోసం తమిళనాడుకి చెందిన సు వెంకటేషన్ గారు నిజాయితీ గల నాయకులు ఆఫీసర్స్ యొక్క ఉద్దేశాలు వింటూ చేశాను. రాజమౌళి, మహేష్ గారి సినిమా సంవత్సరంన్నరలో వచ్చేస్తుందని నమ్ముతున్నాను.దిల్ రాజు గారు ఎంతో భారీగా ఈ సినిమా చేశారు.

రామ్ చరణ్

Updated Date - Jan 02 , 2025 | 07:10 PM