SS Rajamouli: రవాణా శాఖ కార్యాలయంలో రాజమౌళి

ABN, Publish Date - Apr 24 , 2025 | 03:31 PM

టాలీవుడ్  దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో దర్శనమిచ్చారు.

టాలీవుడ్  దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో దర్శనమిచ్చారు. తన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యూవల్ చేసుకునేందుకు ఖైరతాబాద్ రవాణా కార్యాలయానికి వచ్చినట్లు హైదరాబాద్ జేటీసీ రమేష్ తెలిపారు. మహేశ్ బాబు- రాజమౌళి సినిమాకు సంబంధించి విదేశాల్లో షూటింగ్ ఉన్న నేపథ్యంలో తన డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చినట్లు తెలిసింది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం రాజమౌళి సంతకం చేసి, ఫొటో దిగారు.


అనంతరం రవాణా శాఖ అధికారులు ఆయనకు డ్రైవింగ్ లైసెన్స్‌ను అందజేశారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో 'ఎస్ఎస్ఎంబి 29' చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇటీవల హైదరాబాద్, ఒడిస్సా ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు  పోషిస్తున్నారు, 

Updated Date - Apr 24 , 2025 | 04:59 PM