Soundarya-Mohan babu: మోహన్‌ బాబుతో ఆస్తి వివాదం.. సౌందర్య భర్త ఏమన్నారంటే

ABN, Publish Date - Mar 12 , 2025 | 05:46 PM

దివంగత నటి సౌందర్య(Soundarya ), మోహన్‌ బాబు(Mohan Babu) మధ్య ఆస్తి తగాదాలు వచ్చాయని, సౌందర్య ప్రమాదంలో చనిపోలేదని, ప్లాన్‌ చేసి చంపేశారంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బహిరంగ లేఖ రాసి నిరసనకు దిగిన సంగతి తెలిసిందే.

దివంగత నటి సౌందర్య(Soundarya ), మోహన్‌ బాబు(Mohan Babu) మధ్య ఆస్తి తగాదాలు వచ్చాయని, సౌందర్య ప్రమాదంలో చనిపోలేదని, ప్లాన్‌ చేసి చంపేశారంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బహిరంగ లేఖ రాసి నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా ఆ వార్త నెట్టింట వైరల్ అవుతున్న నేపథ్యంలో సౌందర్య భర్త రఘు (GS Raghu) స్పందించాడు. మోహన్‌బాబుతో (Mohan Babu) తమకెలాంటి ఆస్తిగొడవలు లేవని లేఖలో పేర్కొన్నారు. 

 

‘‘హైదరాబాద్‌లోని సౌందర్య ఆస్తికి సంబంధించి కొన్ని రోజులుగా తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఆమె ఆస్తిని నటుడు మోహన్‌బాబు ఆక్రమించుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నా. ఆయనతో సౌందర్య ఎలాంటి  లావా దేవీలు జరపలేదు. వారి కుటుంబంతో మాకు 25 ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది. నేను మోహన్‌బాబును ఎంతో గౌరవిస్తా. మేమంతా ఒకే కుటుంబంగా ఉంటాం. మాకెలాంటి ఆస్తి గొడవలు లేవు. లావాదేవీలు అంతకన్నా లేవు’’ అని అన్నారు. 

Updated Date - Mar 12 , 2025 | 05:46 PM