Sonakshi Sinha: జటాధర కోసం సోనాక్షిసినా ఎంట్రీ..

ABN, Publish Date - Mar 08 , 2025 | 02:45 PM

తెలుగు సినిమాల్లో నటించేందుకు బాలీవుడ్‌ తారలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రియాంకా చోప్రా, అలియాభట్‌, దీపికా పదుకొణె, జాన్వీకపూర్‌, అనన్యపాండే వంటి భామలు ఇప్పటికే తెలుగు సినిమాల్లో నటించి అలరించారు. ఇప్పుడు వీరి జాబితాలో


తెలుగు సినిమాల్లో నటించేందుకు బాలీవుడ్‌ తారలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రియాంకా చోప్రా, అలియాభట్‌, దీపికా పదుకొణె, జాన్వీకపూర్‌, అనన్యపాండే వంటి భామలు ఇప్పటికే తెలుగు సినిమాల్లో నటించి అలరించారు. ఇప్పుడు వీరి జాబితాలో సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) చేరారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌లతో బీటౌన్‌లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు సోనాక్షి.  ఇటీవల ‘హీరామండి’తో అలరించిన ఆమె టాలీవుడ్‌ ఎంట్రీకి సిద్దమయ్యారు. సుధీర్‌బాబు హీరోగా నటిస్తోన్న ‘జటాధర’తో (Jatadhara)ఆమె తెలుగులోకి అడుగుపెడుతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం శనివారం పోస్టర్‌ విడుదల  చేసింది. ప్రస్తుతం ఇది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

పాన్‌ ఇండియా సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వెంకట్‌ కల్యాణ్‌ (Venkat Kalyan) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్‌బాబు ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మితమవుతోంది. ‘శాస్ర్తీయ, పౌరాణిక అంశాల మేళవింపుతో ఈ కథను రాశారు. ఈ రెండు జానర్స్‌కు చెందిన ప్రపంచాల్ని వెండితెరపై చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఓ సరికొత్త అనుభూతి పొందుతారని సుధీర్‌బాబు తెలిపారు.  

Updated Date - Mar 08 , 2025 | 02:49 PM