Akash: సునీత తనయుడి రెండో సినిమా... హీరోయిన్ ఎవరో తెలుసా...
ABN, Publish Date - Feb 25 , 2025 | 03:17 PM
సింగర్ సునీత్ తనయుడు 'సర్కారు నౌకరి' మూవీతో జనం ముందుకు వచ్చాడు. తాజాగా అతని రెండో సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో భైరవి హీరోయిన్ గా పరిచయం అవుతోంది.
ప్రముఖ గాయని సునీత (Singer Sunitha) తనయుడు ఆకాశ్ గోపరాజు (Akash Goparaju) గత యేడాది హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు (K. Raghavendra rao) నిర్మించగా, అతను నటించిన 'సర్కారు నౌకరి' (Sarkaaru Naukari) సినిమా 2024 జనవరి 1న విడుదలైంది. అయితే కథలో కొత్తదనం ఉన్నా... ఆ కాన్సెప్ట్ బేస్డ్ మూవీని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేదు. అయినా తగ్గేదే లే అంటున్నా ఆకాశ్ గోపరాజు. ఇప్పుడతను మరో సినిమాను చేస్తున్నాడు. ఇంకా పేరు నిర్ణయం కానీ ఈ సినిమాను శివ దర్శకత్వంలో తాటి బాలకృష్ణ నిర్మిస్తున్నారు.
ఆకాశ్ గోపరాజు మొదటి చిత్రం ద్వారా భావన హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఇప్పుడు మలి చిత్రంలోనూ కొత్త అమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది. ఆ అమ్మాయి పేరు భైరవి. అందం, అభినయం కలబోసిన పాత్రను భైరవి చేస్తోందని, ఆమెకీ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని మేకర్స్ చెబుతున్నారు. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రను ఇందులో భైరవి పోషిస్తోందట. ఇది విలేజ్ బ్రాక్ గ్రౌండ్ లో తెరకెక్కుతున్న రొమాంటిక్ లవ్ సస్పెన్స్ కామెడీ మూవీ అని నిర్మాత తాటి బాలకృష్ణ తెలిపారు. షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోందని, త్వరలోనే మూవీ టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని అన్నారు. ఈ చిత్రానికి యశ్వంత్ సంగీతం అందిస్తున్నారు.