Sankranthiki Vasthunam Vs Game Changer: వెంకీ దూకుడుకి చరణ్ 'గేమ్ ఛేంజ్'
ABN, Publish Date - Jan 16 , 2025 | 05:50 PM
Sankranthiki Vasthunam Vs Game Changer: ఈ సంక్రాంతి పోటీల్లో ప్రేక్షకులు 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాని విజేతగా నిలబెట్టారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' కాస్త నిరాశపరిచిందే అని చెప్పాలి. దీంతో ఆడియెన్సే కాదు విక్టరీ వెంకటేష్ కూడా చరణ్ గేమ్ ని ఛేంజ్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన 'గేమ్ ఛేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు సంక్రాంతికి రేసులో నిలిచినా విషయం తెలిసిందే. కాగా ఈ సంక్రాంతి పోటీల్లో ప్రేక్షకులు 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాని విజేతగా నిలబెట్టారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' కాస్త నిరాశపరిచిందే అని చెప్పాలి. దీంతో ఆడియెన్సే కాదు విక్టరీ వెంకటేష్ కూడా చరణ్ గేమ్ ని ఛేంజ్ చేశారు.
గేమ్ ఛేంజర్ మొదటగా జనవరి 10న సంక్రాంతి బరిలో నిలవగా.. డాకు మహారాజ్ 12న, సంక్రాంతికి వస్తున్నాం 14న పోటీల్లో నిలిచాయి. ప్రస్తుతం 'డాకు మహారాజ్' బాక్సాఫీస్ వద్ద బలంగా కనిపిస్తున్న, ప్రజలు సంక్రాంతికి వస్తున్నాం వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో గేమ్ ఛేంజర్ థియేటర్ ఆక్యుపెన్సీలను తగ్గించి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి పెంచేస్తున్నారు. ప్రధానంగా ఉత్తరాంద్రలో ఈ వాతావరణం క్లియర్ గా కనిపిస్తుంది. రెండు దిల్ రాజు సినిమాలే అయినా 'గేమ్ ఛేంజర్' ప్రదర్శిస్తున్న థియేటర్లు బోసిపోయి కనిపించాయి. మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ బోర్డులతో కనిపించింది. టికెట్లు దొరకటం కూడా కష్టంగానే మారింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుండి 'సంక్రాంతికి వస్తున్నాం' థియేటర్ అక్యుపెన్సీ పెంచనున్నారు.
ఈ సినిమా లేట్‌గా వచ్చిన లేటెస్ట్‌గా కలెక్షన్లను రాబడుతోంది. మొదటి ఆట నుండే ఈ సినిమాకు పాజిటివ్ స్పందన రావడంతో.. సంక్రాంతి వైబ్ మొత్తం ఈ సినిమానే ఆక్రమించేసింది. ముఖ్యంగా పాటలు ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్‌గా నిలిచాయి. సినిమా విడుదలకు ముందే పాటలు సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్లాయి. దీంతో విజయం సునాయాసమైంది. విక్టరీ వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కింది. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.