Samantha : నందినీ రెడ్డితో సమంత మరోసారి...
ABN, Publish Date - Mar 10 , 2025 | 10:05 AM
గతంలో నందినీ రెడ్డితో రెండు సినిమాలతో పాటు ఓ టాక్ కూడా చేసిన సమంత ఇప్పుడు మరోసారి ఆమెతో జత కట్టబోతోంది. వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతోంది.
స్టార్ హీరోయిన్ సమంత (Samantha), లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి (Nandini Reddy) ది హిట్ కాంబినేషన్. కృష్ణవంశీ (Krishna Vamsy) తో పాటు పలువురి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన నందినీ రెడ్డి ఆ తర్వాత దర్శకురాలిగా మారి పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. 'అలా మొదలైంది'తో దర్శకురాలిగా కెరీర్ ప్రారంభించిన నందినీ రెడ్డి స్టార్స్ వెనక పడుకుండా, కథకు ప్రాధాన్యమిచ్చి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. సిద్ధార్థ్, సమంత జంటగా గతంలో 'జబర్ దస్త్' మూవీని తెరకెక్కించారు నందినీరెడ్డి. ఆ సినిమా పెద్దంతగా ఆడలేదు. అయితే ఆ తర్వాత వచ్చిన 'ఓ బేబీ' (Oh Baby) ఘన విజయం సాధించింది. అంతేకాదు... నటీమణులు లక్ష్మీ (Lakshmi), సమంతలకు, నాగశౌర్య (Naga Sourya), తేజ సజ్జా (Teja Sajja), రావు రమేశ్ (Rao Ramesh) లకు మంచి పేరునూ తెచ్చిపెట్టింది. ఇప్పుడు మరోసారి సమంత నాయికగా తానో సినిమా చేయబోతున్నానని నందినీ రెడ్డి తెలిపింది.
నాగచైతన్య (Naga Chaitanya) నుండి విడిపోయిన తర్వాత కొంతకాలం ఆరోగ్యంపై దృష్టిపెట్టిన సమంత నిదానంగా కోలుకుంది. వెబ్ సీరిస్ లతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటూనే సొంత నిర్మాణ సంస్థనూ స్థాపించింది. తన సొంతబ్యానర్ లో 'మా ఇంటి బంగారం' అనే సినిమాను సమంత నిర్మిస్తోంది. ఇవాళ మహిళలకు చిత్రసీమలో తగిన ప్రాధాన్యం లేదనేది వాస్తవం. అలానే వేతనాల విషయంలోనూ ఎంతో వ్యత్యాసం ఉంది. ఇలాంటి వాటికి తావు ఇవ్వకుండా సమంత తన సొంత చిత్రంలో అందరికీ సమానవేతం, గౌరవం అందిస్తోందని నందినీ రెడ్డి తెలిపింది. ఈ సినిమా తర్వాత తాను సమంతతో ఓ సినిమా చేయబోతున్నానని వెల్లడించింది. అయితే అది సమంత ఓన్ బ్యానర్ లో ఉంటుందా? లేకపోతే... వేరే నిర్మాణ సంస్థ వీరితో మూవీ చేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. విశేషం ఏమంటే... సమంత, నందినీ రెడ్డి అనుబంధం ఎప్పటి నుండి బలంగా కొనసాగుతోంది. ఆ మధ్య ఆహా ఓటీటీలో సమంత 'సామ్ జామ్' (Sam Jam) పేరుతో చేసిన టాక్ షో కు నందినీ రెడ్డి క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరించింది.

Also Read: స్పెషల్ సాంగ్‌తో సిద్ధమా?
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి