Samantha: నేను అలా చేశా.. మీరు చేసి చూడండి.. మళ్లీ మళ్లీ చేస్తారు
ABN, Publish Date - Feb 20 , 2025 | 11:32 AM
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత.. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా సామ్ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత.. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా సామ్ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. సోషల్ మీడియా రాజ్యమేలుతున్న రోజుల్లో, ప్రతి ఐదు నిమిషాల్లో రెండు నిమిషాలు ఫోన్‌కే కేటాయిస్తున్న సమయంలో మూడు రోజులపాటు ఫోన్‌కు దూరంగా ఉన్నట్లు ఆమె చెప్పారు. ఆ అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. (Samantha loves her own company)
‘‘మూడు రోజులు సైలెంట్‌గా ఉన్నాను. ఫోన్ లేదు. ఎవరితో కమ్యూనికేషన్ లేదు. నాతో నేను మాత్రమే ఉన్నాను. మనతో మనం ఒంటరిగా ఉండడం కష్టమైన విషయాల్లో ఒకటి. అతి భయంకరమైనది. కానీ, ఇలా మౌనంగా ఉండడాన్ని నేను ఇష్టపడతాను. మిలియన్‌సార్లు ఇలా ఒంటరిగా గడపమని చెప్పినా ఉంటాను. మీరు కూడా ఇలా ఉండటానికి ప్రయత్నించండి’’ అంటూ సూచనలిచ్చారు. ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న సమంత ప్రస్తుతం ఆరోగ్యంపై పూర్తి శ్రద్థ పెట్టినట్లు ఈ పోస్ట్ ద్వారా తెలుస్తోంది. (Samanth Three Days Silence)