Ram Gopal Varma: ఆర్జీవీ 'సిండికేట్' గురించి మీకు తెలుసా..
ABN, Publish Date - Jan 23 , 2025 | 08:52 AM
Ram Gopal Varma: ఆర్జీవీ రీసెంట్‌గా 'సత్య కన్ఫెషన్' పేరుతో ఒక ఎమోషనల్ ట్వీట్ పెట్టాడు. దీనికి సంపూర్ణ సినీలోకం కూడా కదిలిపోయింది. ఇప్పుడు ఆయనకు సత్య, రంగీలా తరహాలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నాని చెప్పిన సంగతి తెలిసిందే.. మరి దీని వెనకున్న చీకటి కోణం ఏంటంటే..
ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మని డేరింగ్ మ్యాన్ అని ఎందుకంటారు? కేవలం ఆయన స్పీచ్‌లు, సెన్సేషనల్ కామెంట్స్, బోల్డ్ యాక్ట్స్, ఇంటర్వ్యూస్ ఆయనకు ఈ పేరు తీసుకు రాలేదు. వాస్తవానికి ఆయన తెరకెక్కించిన శివ, సత్య, రంగీలా, కంపెనీ వంటి రా(RAW FILMS) చిత్రాలు ఆయనకు డేరింగ్ డైరెక్టర్ అనే పేరుని తీసుకొచ్చాయి. అయితే 2006 తర్వాత ఆయన చెప్పుకోదగ్గ సినిమాలు పక్కకు పెడితే పరమ చెత్త చిత్రాలు తెరకెక్కించాడు. ఇదంతా పక్కనపెడితే ఇటీవల ఎదో జ్ఞానోదయం అయినట్లు పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? చీకటి కోణం ఏంటంటే..
రాంగోపాల్ వర్మ ఎన్నో సార్లు ఎన్నో వాగ్దానాలు చేసి తూచ్ అని చెప్పిన సందర్భాలు ఎన్నో చూశాం. రీసెంట్ గా ఆయన 'సత్య కన్ఫెషన్' పేరుతో ఒక ఎమోషనల్ ట్వీట్ పెట్టాడు. దీనికి సంపూర్ణ సినీలోకం కూడా కదిలిపోయింది. ఇప్పుడు ఆయనకు సత్య, రంగీలా తరహాలో ఓ ప్రాజెక్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. దీనిని తాజాగా అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు ఎన్నో చీకటి కోణాలను తన దృక్పథంతో చూపించిన వర్మ మరోసారి ఇంకో చీకటి కోణాన్ని సినిమాగా తెరకెక్కించనున్నాడు.
ఆ కథే 'సిండికేట్'. 70వ దశకంలో స్ట్రీట్ గ్యాంగ్స్‌తో మొదలుపెట్టి ఐసిస్ వరకు ఎన్నో రకాల సంఘ వ్యతిరేక శక్తులను ఇండియా చూసింది. అయితే గత పది పదిహేనేళ్లుగా చెప్పుకోగదగ్గ కొత్త గ్రూప్స్ లేవని.. ఒకవేళ భవిష్యత్తులో కొత్త తరహా సంఘ వ్యతిరేక శక్తులు ఎలా ఉంటుందో ‘సిండికేట్’ రూపంలో చూపించనున్నట్లు ప్రకటించారు. దీనికి ‘‘ఓన్లీ మ్యాన్ కెన్ బి ద మోస్ట్ టెర్రిఫైయింగ్ యానిమల్’ అంటూ ట్యాగ్ లైన్ జోడించాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్, కాస్టింగ్ అతి త్వరలోనే ప్రకటిస్తామన్నాడు. ఈ సారి ఆయన అభిమానులే కాదు హేటర్స్ కూడా వర్మా ఒక సిన్సీయర్ సినిమా తీసి సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు.